ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మచిలీపట్నంలో మంత్రి రవీంద్ర ప్రజాదర్బార్​ - ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ - Minister RavindraReceiving Requests - MINISTER RAVINDRARECEIVING REQUESTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 7:41 PM IST

Minister Kollu Ravindra Conduct Praja Darbar in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అన్ని నియోజకవర్గాల్లో వారానికి ఒక రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్​లో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని మంత్రి విమర్శించారు. 

ఇప్పటివరకు దాదాపు 1338 అర్జీలు రాగా, 970 పరిష్కరించినట్లు మంత్రి రవీంద్ర చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, పెన్షన్ సమస్యలపై మరికొన్ని అర్జీలు పెండింగ్​లో ఉన్నాయని వాటిని కూడా త్వరిగతిన పరిష్కరిస్తామని ఆయన వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వారి సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారని మంత్రి పేర్కొన్నారు. సమస్యలపై మాట్లాడిన వారిపై దాడులు చేసి, కేసులు పెట్టించిన సంఘటనలు చూశామన్నారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details