ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంత్రి అమర్​నాథ్​కు ఝలక్​ - గవర్నర్​ బంగ్లాలో మీడియా సమావేశానికి అధికారులు నో - Amarnath Media Meeting under Tree

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 11:31 AM IST

Minister Amarnath Media Meeting at Governor Building : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్​నాథ్​కు విశాఖ జిల్లా యంత్రాంగం ఝలక్ ఇచ్చింది. నగరంలోని గవర్నర్ బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది. ఇన్నాళ్లూ మంత్రి ఇక్కడే విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ పరమైన అంశాలపై ప్రతిపక్షాలను తూలనాడేవారు. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిపై మాట్లాడేందుకు శనివారం సాయంత్రం గవర్నర్ బంగ్లాలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

Minister Amarnath faced Insult  At Visakah Governor Building : రాజకీయ అంశాలపై ఇక్కడ విలేకరుల సమావేశాలు నిర్వహించొద్దని గవర్నర్ బంగ్లా అధికారులు సూచించారు. దీంతో అమర్నాథ్ చేసేదేంలేక బంగ్లా వెలుపలే చెట్టుకింద మీడియా ప్రతినిధులతో మాట్లాడి వెనుదిగారు. రాజకీయపరమైన విమర్శలు చేయడానికి గవర్నర్ భవనం (Governor Building) వేదిక కాకూడదని ఇటీవల యంత్రాంగం నిర్ణయించింది. వారం క్రితం తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని భావించగా, యంత్రాంగం అడ్డుకుంది. దాంతో ఆమె వైఎస్సార్సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. 

ABOUT THE AUTHOR

...view details