ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Lok Sabha Sessions 2024 - LOK SABHA SESSIONS 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 10:58 AM IST

Updated : Jun 27, 2024, 12:17 PM IST

Lok Sabha Sessions 2024 Live : 18వ లోక్​సభ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు (జూన్ 27వ తేదీ) ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. తర్వాత ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వంటివి ఉంటాయి. ఈ సభ వాయిదా తర్వాత వర్షాకాల సమావేశాల నిమిత్తం జులై 22వ తేదీన పార్లమెంటు మళ్లీ సమావేశమైనప్పుడు కేంద్ర బడ్జెట్‌ సమర్పించే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీన 18వ లోక్​సభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్​ను ఎన్నుకున్న తర్వాత ఆయన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిరోజు 262 మంది, రెండో రోజు మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. ఇక 26వ తేదీన లోక్​సభ స్పీకర్​ను ఎన్నుకున్నారు. ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత లోక్​సభ స్పీకర్​ ఎన్నిక జరపాల్సి వచ్చింది. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. అలా ఓం బిర్లా రెండోసారి లోక్​సభ స్పీకర్​గా ఎన్నికయ్యారు.
Last Updated : Jun 27, 2024, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details