LIVE వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న వైఎస్ సునీత- కడప నుంచి ప్రత్యక్ష ప్రసారం - YS Viveka death anniversary
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 12:13 PM IST
|Updated : Mar 15, 2024, 1:23 PM IST
YS Viveka death anniversary : ‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోంది’ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. ‘నా భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. వివేకా హత్య గురించి బాహ్యప్రపంచాని కంటే ముందే జగన్‌కు, ఆయన సతీమణి భారతికి తెలుసన్న అనుమానం ఉంది’ అని ఆమె తెలిపారు. వివేకా హత్య విషయం తెల్లవారుజామునే జగన్‌కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది కాబట్టే ఎంపీ అవినాష్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని, న్యాయం జరగకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా జగన్ వద్దకు వెళ్లింది. కానీ ఆయన మాతో విడిగా మాట్లాడకుండా, ఇతరుల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారు. నా కుమార్తె, అల్లుడిపైనే వేలు చూపించారు. శత్రువులు మా ఇంట్లోనే ఉన్నారని ఆలస్యంగా గ్రహించాం. అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని తెలిపారు. వివేకా హత్య జరిగి అయిదేళ్లయినా ఇప్పటి వరకు కేసు దర్యాప్తు కొలిక్కిరాకపోవడం, హంతకులకు శిక్షపడకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా వర్దంతి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Mar 15, 2024, 1:23 PM IST