ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫ్యాన్‌కు ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్‌కు ఉరితాడు బిగించినట్లే: బీజేపీ నేతలు - BJP Alliances in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 7:42 PM IST

Lanka Dinakar on BJP Alliances in AP: రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర నేతలు లంకా దినకర్‌, విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్‌ పాలన అంతం చేయాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్‌కు ఉరితాడు బిగించినట్లేనని చెప్పారు. కేంద్ర పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటామని దినకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా కంఠక పాలన సాగుతోందని ఎవరైనా వైసీపీ నాయకుల అరాచకాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు ఎలాంటి తావు లేదని అన్నారు. ప్రజలను నిలువునా మోసం చేసిన జగన్​కు వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అధికారం అండతో నాయకులు రెచ్చిపోతున్నారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details