LIVE : హైదరాబాద్లో గణేషుడి నిమజ్జన శోభాయాత్ర - ప్రత్యక్ష ప్రసారం - Khairatabad Ganesh Nimajjanam 2024 - KHAIRATABAD GANESH NIMAJJANAM 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 6:41 AM IST
|Updated : Sep 17, 2024, 10:44 PM IST
Khairatabad Ganesh Nimajjanam 2024 Live : హైదరాబాద్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా, పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగఒడికి చేరనున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి ఇప్పటికే ఏర్పాట్లు ముగిశాయి. సోమవారం రాత్రి 10 గంటలకు చివరిసారిగా కలశపూజ నిర్వహించిన తర్వాత, పార్వతీ తనయుడిని టస్కర్‌పైకి చేర్చారు. స్వామివారికి ఇరువైపులా ఉన్న దేవతాముర్తుల విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత, ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల కొంగుబంగారమై పది రోజుల పాటు, నీరాజనాలందుకున్న మహాకాయుడి నిమజ్జనానికి భారీగా భక్తజనం రానున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ మహాక్రతువు సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి బందోబస్తులో 700 మంది పోలీసులు పాల్గొనగా, 56 సీసీటీవీ కెమెరాలతో పహారా నిర్వహిస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు.
Last Updated : Sep 17, 2024, 10:44 PM IST