ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కనకదుర్గమ్మ నివేదనలోనూ కల్తీ - 'డింగ్​ డాంగ్​ బెల్'​తో ఏడాదికి కోటిన్నర స్వాహా - విజయవాడ కనకదుర్గమ్మ నివేదనలో కల్తీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 5:23 PM IST

Janasena Pothina Mahesh Fires On YSRCP Govt : విజయవాడ కనకదుర్గమ్మ నివేదనకు నాణ్యమైన బియ్యం వినియోగించాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. అమ్మవారి నివేదనకు టెండర్లలో చెప్పిన మేరకు నాణ్యమైన బియ్యం కాకుండా నాసిరకం బియ్యం వాడుతూ, ఏడాదికి కోటిన్నర రూపాయలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. అమ్మవారిని, అమ్మవారి భక్తుల్ని మోసం చేస్తున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

Inferior rice Using in Vijayawada Kanakadurga Nivedana : టెండర్ లో సాయి మణికంఠ ఏజెన్సీ లలిత బ్రాండ్ రైస్ సరఫరా చేస్తామని అంగీకరించి ఇప్పుడు డింగ్ డాంగ్ బెల్ అనే కంపెనీ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి, ఆలయ ఈవో, అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేవుడి నైవేద్యం పేరిట వ్యాపారం చేస్తూ అన్యాయంగా దోచుకోవడం అరాచకమని ధ్వజమెత్తారు. ఈ మోసానికి పాల్పడ్డవారికి ప్రభుత్వం తక్షణం శిక్ష అమలు చెయ్యాలని పోతిన మహేష్​ కోరారు. 

ABOUT THE AUTHOR

...view details