టీడీఆర్ కుంభకోణంలో వైసీపీ అభ్యర్థి భూమన ప్రధాన సూత్రధారి: జనసేన నేత కీర్తన - Janasena leader Kirtana - JANASENA LEADER KIRTANA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 8:46 AM IST
Janasena Leader Kirtana Comment on TDR Bonds Scam : వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుపతిలో అభివృద్థి పేరుతో అవినీతి జరిగిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ఆరోపించారు. రోడ్ల అభివృద్ధి వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో భూమన కుటుంబ సభ్యులు వందల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో వైసీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.
టీడీఆర్ బాండ్ల స్కామ్‌పై వైసీపీ అభ్యర్థి అభినయ్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలని కీర్తన డిమాండ్ చేశారు. బాండ్ల పేరుతో భారీ స్కామ్‌కు అభినయ్‌రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున స్థలాలు ఆక్రమించారని ధ్వజమెత్తారు. అభినయ్‌రెడ్డి ఎలాంటి తప్పలేదని నిరూపించుకోవడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల స్కామ్‌లో అభినయ్‌రెడ్డి బంధువు వర్గం వల్లే అని ఆరోపించారు.