తిరుమలలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టేది లేదు : కిరణ్ రాయల్ - Kiran Royal Fires on YSRCP Leaders - KIRAN ROYAL FIRES ON YSRCP LEADERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 8:21 PM IST
Kiran Royal on Tirumala Tickets : తిరుమలలో వైఎస్సార్సీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. మాజీ మంత్రుల కనుసన్నల్లోనే అన్ని అక్రమాలు జరిగాయని విమర్శించారు. శ్రీవారి ఆర్జిత సేవ, తోమల సేవ, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు కలిపి రోజుకు 54 టికెట్లు విక్రయించారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు మేరకే ఈ టికెట్లు మంజూరు చేసినట్లు కిరణ్ రాయల్ వివరించారు.
Kiran Royal Fires on YSRCP : మాజీ మంత్రి రోజా, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుమలలో చాలా దోచుకున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. రోజు వారు ఇక్కడే తిరుగుతుంటారని విమర్శించారు. మరి వారి సిఫార్సు లేఖకు ఎన్ని శ్రీవారి టికెట్లు తీసుకున్నారో అని తెలిపారు. తాము దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టేవారని చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తాన్ని బయటకు తెస్తామని, అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. దీనిపై కమిటీ వెేస్తామని, జనసేన పార్టీ లక్ష్యం తిరుమల ప్రక్షాళన అని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు.