ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: శ్రీహరికోట - పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం - ప్రత్యక్ష ప్రసారం - PSLV C60 SPADEX EXPERIMENT LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 9:46 PM IST

Updated : Dec 30, 2024, 10:39 PM IST

Live: శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని ప్రయోగిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాత్రి 10గంటల 15 సెకన్లకు PSLV సీ-60 ప్రయోగం చేపట్టనుంది. తొలుత సోమవారం రాత్రి 9:58 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే అనంతరం స్పేడెక్స్‌ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చేశారు. రాత్రి 9.58 గం.కు బదులుగా 10 గంటల 15 సెకన్లకు ప్రయోగించాలని నిర్ణయించారు. దీనిపై ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని, రాకెట్‌ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారితీసిందని వెల్లడించారు. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం అయిందని అన్నారు. 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్‌ చేశామని సోమ్‌నాథ్‌ తెలిపారు. కాగా  పీఎస్‌ఎల్‌వీ-సీ60 ద్వారా ప్రధానంగా స్పేడెక్స్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. స్పేడెక్స్‌ ప్రయోగం ద్వారా ఛేజర్‌, టార్గెట్‌ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సీ-60 ప్రవేశపెట్టనుంది. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుంది. పీఎస్ఎల్వీ సీ-60 స్పేడెక్స్‌ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Dec 30, 2024, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details