ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'250 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు' - మేకిన్‌ ఇండియాకు ప్రత్యక్ష ఉదాహరణ : సుబ్బారావు - ICF GM Subbarao Interview - ICF GM SUBBARAO INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 1:31 PM IST

ICF General Manager SubbaRao Interview : భారతీయ రైల్వేల ప్రస్థానంలో వందేభారత్ విప్లవాత్మకమైన మార్పునకు ప్రతీక. ఐదేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైల్. ఇప్పుడు వందేభారత్ స్లీపర్ గానూ మారి దూరప్రాంతాలకు పరుగుపెట్టేందుకు సిద్ధమైంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు ప్రస్తుతం వివిధ పరీక్షలు పూర్తి చేసుకుని త్వరలోనే పట్టాలు ఎక్కబోతోంది. 

మరి వందేభారత్‌ రైలు ఎందుకు తెచ్చారు? ఈ ఆలోచన అసలు ఎవరిది? మేకిన్‌ ఇండియాకు వందేభారత్‌ నిదర్శనమా? వందేభారత్‌లో ఉన్న సదుపాయాలు ఏంటి? సంప్రదాయ బోగీలకు, ఇందులో ఉన్న బోగీలకు తేడా ఏంటి? వందేభారత్‌ వేగం పెరిగే అవకాశం ఉందా? వందేభారత్‌ స్లీపర్‌ ఎప్పుడు రావచ్చు? ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రస్తుతం 78 వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ప్రాజెక్టును చేపట్టబోతున్నామంటున్న చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ యూ.సుబ్బారావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details