ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కోటప్పకొండలో ఘనంగా శివరాత్రి - పోటెత్తిన భక్తులు - Huge Devotees in Kotappakonda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 8:22 PM IST

Heavy Devotees  In Kotappakonda Temple : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు పల్నాడు జిల్లా వాసులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు, మహిళలు, యువత త్రికోటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆ కోటయ్య ఆశీస్సులు తమకు ఉండాలని ఆ పరిసర గ్రామాల వాసులు కొండకు భారీగా వెళ్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తజనం భారీగా తరలిరావడంతో కోటప్పకొండ జనసంద్రంగా మారింది. 

Huge Devotees in Kotappakonda : నరసరావుపేట, చిలకలూరిపేట రోడ్డు మార్గాల నుంచి ద్విచక్రవాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వామి వారి మెుక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారు. ఆలయాధికారులు, జిల్లా యంత్రాంగం భక్తులకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రం మెుత్తం శివనామస్మరణతో మార్మోగింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తజనం పరమశివుడి సేవలో పరవశించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details