ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కాస్ట్యూమ్ డిజైనింగ్ పోటీల్లో బంగారు పతకం- దిల్లీలో సత్తా చాటిన తెలుగు తేజం - COSTUME DESIGNING

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 1:29 PM IST

Harshita Won Gold Medal in Costume Designing Competition : జాతీయ స్థాయిలో నిర్వహించిన కాస్ట్యూమ్​ డిజైనింగ్​ పోటీల్లో ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని నూకసాని హర్షిత బంగారు పతకం కైవసం చేసుకుంది. స్కిల్​ ఇండియా ఆధ్వర్యంలో శనివారం న్యూదిల్లీలో జాతీయస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించగా హర్షిత విశిష్ట ప్రతిభ కనబరిచి తాను రూపొందించిన కాస్ట్యూమ్ కు బంగారు పతకం దక్కించుకుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధ్యమైందని హర్షిత ఆనందం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా సీఎస్​ పురానికి చెందిన నూకసాని గంగాధరరావు, శారదా పద్మల కుమార్తె హర్షిత. గంగాధరరావు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. హర్షిత పాట్నాలోని నిఫ్ట్ల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు మూడో సంవత్సరం చదువుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆధ్వర్యంలో శనివారం న్యూదిల్లీలో స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కాస్ట్యూమ్​ పోటిల్లో హర్షిత ప్రతిభ కనబరిచింది. తాను రూపొందించిన కాస్ట్యూమ్​కు బంగారు పతకం దక్కించుకుంది. 

ABOUT THE AUTHOR

...view details