ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఘనంగా ఆంబోతు అంత్యక్రియలు- ప్రత్యేక పూజలు, నృత్యాలు, మేళతాలతో ఊరేగింపు - grand funeral to dead bull - GRAND FUNERAL TO DEAD BULL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 4:42 PM IST

Grand Funeral Held for Dead Bull in Marlapalli Village of Vizianagaram District : ఆ గ్రామస్థులకు పశువులంటే ప్రాణం. అంతే కాదు వాటిపై ఉన్న మమకారం, భక్తి భావానికి సూచికగా తోమడపెద్దు పేరిట ఓ ఆంబోతును సమైక్యంగా పెంచుకున్నారు. దానిని సింహాద్రి అప్పన్న పేరుతో గ్రామస్థులందరూ పూజించడమే కాదు, గ్రామ దేవతగా ప్రతియేటా ప్రత్యేక పండుగ నిర్వహిస్తారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మర్లపల్లిలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ఇది. మర్లపల్లి వాసుల ఆరాధ్యదైవం, వారి చేత సింహాద్రి అప్పన్న స్వామిగా పూజలు అందుకుంటున్న తోమడపెద్దు నిన్న(మంగళవారం) రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. 

దీంతో రాత్రంతా గ్రామస్థులు ప్రత్యేక పూజలు, భజనలు చేసి ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. అది కూడా సాదాసీదాగా కాదు. పూలమలతో అలంకరించిన ఎడ్లబండిపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. బాణసంచా కాలుస్తూ, కోలాటం, నృత్యాలు, మేళతాలలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మనిషికి ఏవిధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో ఆ తరహాలో అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details