150 అడుగుల జాతీయ పతాకం - ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ - National Flag Stupa in Vijayawada
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 1:49 PM IST
Governor Justice Abdul Nazir will Unveil the National Flag Stupa in Vijayawada : జగ్గయ్యపేటలో జాతీయ పతాక స్తూపాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. 150 అడుగుల ఎత్తు ఉన్న జాతీయ జెండాను ఒకటిన్నర ఎకరంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. నగరంలోని 31వ వార్డు విష్ణుప్రియనగర్‌లో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆవిష్కరణ ప్రాంగణాన్ని జాతీయ జెండాతో అలకరించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలకు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
జగ్గయ్యపేటలో జాతీయ పతాక స్తూప ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఈ జాతీయ చిహ్నాన్ని చక్కని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పార్కు నిర్మాణం, సుందరీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట ప్రాంతానికి స్వాతంత్య్ర సమరంలో ఉన్న ప్రత్యేకతను కూడా గవర్నర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.