ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు - వ్యాపారి ఇంట్లో 50 తులాల బంగారం చోరీ - GOLD THEFTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 3:05 PM IST

Gold and Money Chori in Railway Koduru at Annamayya District : అన్నమయ్య జిల్లాలో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. రైల్వేకోడూరులో ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దోచుకున్నారు. మాచిరాజు కృష్ణంరాజు అనే వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి బీరువాలో దాచిన సొత్తును చోరీ చేశారు. సోమవారం (అక్టోబర్​ 7న) బాధితులు తిరుపతి ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చి చూసేసరికి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. దీంతో అసలు విషయం గ్రహించి బాధితులు లబోదిబోమన్నారు. 

Railway Koduru at Annamayya District : ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట సమయంలో చోరీ జరిగి ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఈ దొంగతనం జరగడంతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో బాధితులు రైల్వే కోడూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details