ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆహార సరఫరా వేగవంతం- గన్నవరం ఎయిర్​పోర్ట్​ నుంచి హెలికాప్టర్ల ద్వారా పంపిణీ - Food Distribution From Airport - FOOD DISTRIBUTION FROM AIRPORT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 5:38 PM IST

Food Distribution From Gannavaram Airport : వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున్న ఆహారాన్ని అందిస్తున్నారు. చివరి వరద బాధితుడి వరకు ఆహారాన్ని అందించాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆహార పంపిణీ ఏర్పాట్లు చేసి చాపర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్​లో మంగళవారం 4 చాపర్లు, 2 చేతక్​ల ద్వారా 46,950 కిలోల కుకింగ్ ఫుడ్, బిస్కెట్లు, మంచినీరు, మందులు, పాలు పంపిణీ చేశారు. ఈరోజు 2 చాపర్ల, 1 చేతక్ ద్వారా 7,175 కిలోల ఆహార పదార్ధాలను వరద బాధితులకు అందించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో చాపర్ల ద్వారా ఆహారాన్ని వరద బాధితులకు ఇబ్బందిలేకుండా త్వరితగతిన పంపిణీ చేస్తున్నామని సూళ్లురుపేట ఆర్డీవో చంద్రమోన్ తెలిపారు. 

నగరంలో నీటమునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు జారవేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆహారాన్ని తెప్పించి బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి వీరపాండ్యన్‌కు అప్పగించారు. గన్నవరం విమానాశ్రయంలో వరద బాధితులకు ఆహారం పంపీణికి సంబంధించి మరింత సమాచారం ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details