ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంత్రి సమక్షంలో టీడీపీ, జనసేన నాయకుల ఘర్షణ - TDP VS JANASENA LEADERS CLASHES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 6:47 PM IST

Fight Between TDP and Janasena Leaders in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలోనే టీడీపీ, జనసేన నాయకులు ఘర్షణ పడ్డారు. గ్రామంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి మంత్రి వస్తున్న సమాచారం కూడా చెప్పలేదన్నారు. స్థానిక జనసేన నాయకులు వైఎస్సార్సీపీ వారితో కలిసిపోయి కూటమి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రి సముదాయించే ప్రయత్నం చేసినా ఇరు పార్టీలవారు వినిపించుకోలేదు. ఆ తర్వాత పోలీసులు వారికి సర్దిచెప్పారు. 

గతంలో మంత్రి మాట్లాడుతూ ఆ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వేరు కాదన్నారని, ఎవరు గెలిచినా మనంమంతా ఒక్కటేనన్నారని కానీ నేడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని స్థానిక టీడీపీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఇటుంటి చర్యలను ఖండిస్తున్నామని స్థానిక నేతలు మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details