కూటమి గెలుపు కోరుతూ కౌలు రైతుల వినూత్న మద్దతు - గోంగూర నారుతో గుర్తుల రూపకల్పన - FARMERS SUPPORT TO NDA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 10:58 AM IST
FARMERS SUPPORT TO NDA: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి విజయం దక్కాలంటూ గుంటూరు జిల్లా అత్తోట రైతులు వినూత్నంగా మద్దతు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో కౌలు రైతులు ఎన్డీఏ పార్టీల గుర్తులను కళాత్మకంగా పంటపొలాల్లో చిత్రించారు. గోంగూర నారుమడితో సైకిల్, గాజు గ్లాసు, కమలం పువ్వు గుర్తులతో రూపొందించారు.
ప్రతి చేతికీ పని - ప్రతి చేనుకు నీరు అనే కూటమి నినాదాన్ని కూడా అందులో పొందుపర్చారు. కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ చేసిన సాయాన్ని రైతులు ఎవరూ మర్చిపోరని కౌలు రైతు యర్రి పాపారావు అన్నారు. గుంటూరు గోంగూర ఎంతో పేరుంది. అందుకే గోంగూర విత్తనాలను ఎన్డీఏ గుర్తుల రూపంలో చల్లి, ఆ నారు వచ్చిన తర్వాత అందరినీ ఆకట్టుకునేలా చేశామన్నారు. ఈ ఎన్నికల్లో రైతుల ప్రయోజనాలు కాపాడే కూటమికి తన వంతు సాయంగా ప్రచారం చేద్దామనే సంకల్పంతోనే కూటమి గుర్తులను రూపొందించినట్లు కౌలురైతు యర్రి పాపారావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కూటమికి ఓటు వేసి గెలిపించాలని కౌలురైతు యర్రి పాపారావు కోరారు.