ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్​తో తమ భూములను కాజేయాలనుకుంటున్నారు : రైతులు - farmers fire on Land titling Act

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 9:02 PM IST

Farmers Fire on Andhra Pradesh Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ తమ భూములను కాజేయాలని చూస్తున్నారని అనకాపల్లిలోని రైతులు ఆరోపించారు. ఈ చట్టం అమలు కోసం ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. చట్టంపై అవగాహన కల్పించకుండా దాచిపెట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. తమ ఆస్తి పత్రాలపై జగన్ ఫొటో వేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అనేక అనుమానాలున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే జగనన్నపేరుతో పోలాల్లో రాళ్లు వేశారు. చివరికి పాసు పుస్తకంపైన జగన్ బొమ్మ వేసుకోవడంతో రైతులు అయోమయానికి గురౌతున్నారు. భూములపై యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందంటూ అన్నదాతలు వాపోతున్నారు. వ్యవసాయ భూములే కాకుండా మున్ముందు ఇళ్లు, ప్లాట్లు, ఖాళీ స్థలాల భద్రతపైనా అనుమానాలు ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు మంచి కోసమే ఈ చట్టాన్ని తీసుకోస్తున్నామని జగన్ నీతులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాలనే తాకట్టు పెట్టిన వ్యక్తి మా భూములను తాకట్టు పెడ్డడని గ్యారెంటీ ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు?. ఇలాంటి చీకటి చట్టలను తీసుకువచ్చి రైతలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయమని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్​లోనే ఇలాంటి చట్టం ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details