ఫేస్బుక్లో పోస్ట్ - ఇరువర్గాల మధ్య ఘర్షణ - Devarapalli Village of Hindupuram
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 7:06 PM IST
Facebook Post on Clash Between Both Parties in Satyasai District : ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఆధారంగా ఇరువర్గాలు ఘర్షణ దిగిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచోసుకుంది. హిందూపురం మండలం దేవరపల్లి గ్రామంలో ఇరువర్గాలు పాత కక్షల కారణంగా బుధవారం సాయంత్రం ఘర్షణకు దిగారు. అక్కడ ఉన్న పెద్దలు సర్ది చెప్పడం వల్ల ఇరువర్గాలు వెనుతిరిగారు. అయితే బుధవారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడు రండి తేల్చుకుందామని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ రోజు ఉదయం ( గురువారం) కట్టెలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో అయిదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Devarapalli Village of Hindupuram : స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హిందుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు ఇరువర్గాల వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.