ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెదిరించి రాజీనామా చేయించారు- గుడివాడ వైసీపీ నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు - EX Volunteers Complaint YCP Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 5:55 PM IST

బెదిరించి రాజీనామా చేయించారు- గుడివాడ వైసీపీ నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు (ETV Bharat)

EX Volunteers Complaint YSRCP Leaders in Gudivada : వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలే కాదు వాలంటీర్లూ బాధితులే. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు బెదిరించడంతో గత్యంతరం లేక చాలామంది రాజీనామా చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వారంతా బయటకు వచ్చి వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులపై ప్రస్తుతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ మాజీ వాలంటీర్లు వైసీపీ నాయకులపై వన్​టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తాము రాజీనామా చేయాలని ఒకటికి పది సార్లు ఫోన్లు చేసి వేధించారని మాజీ వాలంటీర్లు తెలిపారు. తమ ఇళ్లకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ తమ చేత ఈ విధంగా చేయించారని ఆరోపించారు. ఇప్పుడు తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు పారిపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాని కోరారు. అదేవిధంగా తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ను కోరుతున్నట్లు మాజీ వాలంటీర్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details