ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గాడిదలకు ఘనంగా పెళ్లి - ఊరేగింపు - ఎక్కడ, ఎందుకో తెలుసా ! - Donkeys Marry for Rains - DONKEYS MARRY FOR RAINS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 7:03 PM IST

Donkeys Marriage for Rains in Satya Sai District : వానల కోసం చాలా ప్రాంతాల్లోని ప్రజలు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. అందులో కప్పలకు పెళ్లిళ్లు చెయ్యడం, చెట్లకు పెళ్లి చేయడం, జంతువులకు పెళ్లి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ గాడిదలకు పెళ్లిళ్లు చేయటం ఎక్కడైన చూశారా? అవునండీ మీరు వింటున్నది నిజమే. తాజాగా ఇలాంటి ఆసక్తికర ఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అక్కడి గ్రామస్థులు గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు.  

వివరాల్లోకి వెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి సరైన వానలు కురవలేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. మరోవైపు బోరు బావులు సైతం ఎండ తీవ్రతకు ఇంకిపోతున్నాయి. చివరికి తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురైంది. దీంతో సకాలంలో వర్షాలు కురవాలని, ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అక్కడి గ్రామస్థులు వాసుదేవ కళ్యాణ మహోత్సవం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేసి ఊరేగింపు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రకృతిని ఆరాధిస్తూ ఇలాంటి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తొందని అక్కడి వారు చెబుతున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.   

ABOUT THE AUTHOR

...view details