దేవినేని ఉమకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు - Devineni Uma TDP Coordinator - DEVINENI UMA TDP COORDINATOR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 4:55 PM IST
Devineni Uma Appointed as TDP Coordinator: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఉన్న రాష్ట్రం ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈసారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న ఉమాకు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు దేవినేని ఉమాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించలేదు. పొత్తులు, అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దేవినేని దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 2009, 2014 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమా మైలవరం నుంచి తిరిగి పోటీ చేయగా వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. తాజాగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్న దేవినేని ఉమకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను టీడీపీ అధిష్ఠానం అప్పగించింది.