ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE పిఠాపురంలో జనసేన నాయకులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమావేశం - ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan meet Janasena leaders - PAWAN KALYAN MEET JANASENA LEADERS

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 5:00 PM IST

Updated : Jul 1, 2024, 6:04 PM IST

Deputy CM Pawan Kalyan meeting with Janasena leaders in Pithapuram: తనను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదన్నారు.  మూడు రోజుల పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన పవన్, కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు. గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. కనిపించిన ప్రతిచోటా డబ్బులు దండుకున్నారు.పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. తప్పులు ఎవరు చేసినా సరిదిద్దుతాం. ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేస్తా. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని' పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన భేటీలో జనసేనాని పాల్గొన్నారు. ఇప్పుడా కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో వీక్షించండి.. 
Last Updated : Jul 1, 2024, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details