ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కానిస్టేబుల్ దౌర్జన్యం- ఎవరూ లేని సమయంలో జేసీబీతో ఇల్లు కూల్చివేత - tadipatri constable house demolish

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 4:58 PM IST

Demolition Of House By Constable With JCB Pilligundla Colony: ఎవరూ లేని సమయంలో కానిస్టేబుల్ జేసీబీతో దౌర్జన్యంగా ఇల్లు కూల్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని పిల్లిగుండ్ల కాలనీ బసవతారక వీధిలో ప్రభుత్వం పట్టా (Government Site) కేటాయించగా ఓ కుటుంబం 20 ఏళ్లుగా నివాసం ఉంటోంది. 

Constable Harassement: తాడిపత్రిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవిశంకర్ ఆ ఇంటి స్థలం తనదని, తమను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే దిగులుతోనే తమ తండ్రి అనారోగ్యానికి గురై మృతి చెందారని బాధితురాలు కన్నీటి పర్యంతం అయ్యారు. కానిస్టేబుల్ బెదిరింపులు ఎక్కువటంతో దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో కానిస్టేబుల్ జెసీబీతో (JCB) తమ ఇల్లు కూల్చివేశారని బాధితులు వాపోయారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేసి నష్టపరిహారం వచ్చేలా చేసి, కానిస్టేబుల్​పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details