కేంద్ర బడ్జెట్ ఎస్సీ, ఎస్టీలపై సవతి తల్లి ప్రేమ చూపించిది- దళిత బహుజన శ్రామిక యూనియన్ - కేంద్ర బడ్జెట్ 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 5:57 PM IST
Dalit Bahujan Labor Union State Secretary Chittibabu On Budget : కేంద్ర బడ్జెట్ 2024 లో సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారని, బడ్జెట్లో సమానత్వం నినాదంగా మాత్రమే ఉందని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత ఆదివాసులకు బడ్జెట్లో కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ అనేది అన్ని వర్గాల వారికి సమానంగా ఉండాలన్నారు.
కేంద్ర బడ్జెట్లో షెడ్యూలు కులాల సంక్షేమానికి సుమారు 1 లక్షా 65 వేల 598 కోట్లు, షెడ్యూల్డ్ తెగల కోసం 1 లక్షా 21 వేల 23 కోట్లు కేటాయించారన్నారు. దళితులకు 44 వేల 282 కోట్లు, ఆదివాసీలుకు 36 వేల212 కోట్లు మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలను కేటాయించారని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ 2024 జనాభా నిష్పత్తి ప్రకారంకేటాయించలేదన్నారు ఎస్సీ, ఎస్టీ లకు కేంద్ర బడ్జెట్ సవతి తల్లి ప్రేమ చూపించిదని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు అన్నారు.