ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల టూర్ - శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు - chandrababu visit tirumala - CHANDRABABU VISIT TIRUMALA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 9:02 AM IST
CM Chandrababu Naidu and Family Visit Tirumala : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 6:45 నిమిషాలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 7:45 నిమిషాలకు రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి రాత్రి 8:50 నిమిషాలకు తిరుమల చేరుకుని స్థానిక గాయత్రి అతిథిగృహంలో బస చేస్తారు. గురువారం ( జూన్ 13) ఉదయం 7:30 నిమిషాల నుంచి 8 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారు.
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీవారిని దర్శించుకొనున్నారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు తిరుపతి , తిరుమల పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుమల వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బృందాలతో ఘాట్ రోడ్లు, మార్గాలను తనిఖీలు చేశారు.