కృష్ణపట్నం పోర్టు తరలింపుపై కార్మికుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 4:53 PM IST
CITU Protest on Krishnapatnam Port in Nellor District : కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేసే ప్రయత్నాలను విరమించాలని నెల్లూరులో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. పోర్టు యాజమాన్యం కంటైనర్ టెర్మినల్‌ను (Container terminal) తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కంటైనర్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ వారు జిల్లా కలెక్టర్‌కు (Collector) విన్నవించారు.
CITU Leader Fires On Shifting Krishnapatnam Terminal to Tamilnadu : కంటైనర్ల రవాణాకు యాజమాన్యం అనుమతి నిరాకరిస్తున్నా, మంత్రి కాకాణి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని సీఐటీయూ (CITU Leader)నేత ప్రసాద్ విమర్శించారు. కంటైనర్ టెర్మినల్ మూతపడితే ఎంతోమంది ఉపాధి కోల్పోతారని, ఆర్థికంగా పలు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని టెర్మినల్ కొనసాగించేలా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.