ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: వరదలపై విజయవాడ కలెక్టరేట్​లో చంద్రబాబు సమీక్ష - ప్రత్యక్షప్రసారం - Chandrababu Press Meet Live - CHANDRABABU PRESS MEET LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 9:23 PM IST

Updated : Sep 1, 2024, 9:50 PM IST

Chandrababu Press Meet in Vijayawada Collectorate Live: విజయవాడ కలెక్టరేట్​లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని సింగ్​నగర్, కానూరులోని కల్పన నగర్‌, మాణిక్యనగర్‌, సనత్‌నగర్‌తోపాటు పలు కాలనీల్లోని రహదారులు తటాకాల్లా మారాయి. మురుగుకాల్వల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా జలదిగ్బంధమైంది. ఏరు-దారి ఏకమైపోవడంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అపార్టుమెంట్ల సెల్లార్లను ఎక్కడికక్కడ వరద ముంచెత్తింది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోతున్న పరిస్థితి నెలకొంది. నీటమునిగిన గుంతల్లో పడి బైక్‌ నడిపేవారు గాయాలపాలవుతున్నారు. వరద ఉద్ధృతంగా ఉండటంతో చెత్త సేకరించేవారు కూడా పనులు మానేశారు. మంచి నీటి సరఫరా చేసే బోర్లు నీటమునిగాయి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి నీరు చేరి ప్రమాదకరంగా మారింది. విజయవాడ కలెక్టరేట్ నుంచి చంద్రబాబు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Sep 1, 2024, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details