ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పారిశ్రమలకు తొలి ప్రాధాన్యత- కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసవర్మ - Bhupathiraju Srinivasa Varma Charge - BHUPATHIRAJU SRINIVASA VARMA CHARGE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 7:57 PM IST

Central Minister Srinivasa Varma Take Charge: కేంద్ర సహాయమంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని ఉద్యోగభవన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ఆయన బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేత సోము వీర్రాజు సహా పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసవర్మను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషిస్తానని శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజల సెంటిమెంట్​ను కాపాడతామన్నారు. 

ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చే వ్యక్తులను, సంస్థలనుగాని పెద్ద ఎత్తున ప్రోత్సాహించడం జరుగుతుందని ఆయన అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి తరలిపోయిన విషయం అందరికీ తెలుసన్నారు. వెళ్లిపోయిన కంపెనీలతో మాట్లాడి వాటికి కావాల్సిన భూములను కేటాయించి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కలిగించే విధంగా ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details