ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు కృషి చేస్తాం: రామ్మోహన్​ నాయుడు - Srikakulam Soft Ball Competitions

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 5:01 PM IST

RamMohan Naidu Attend Soft Ball Closing Ceremony (ETV Bharat)

Central Minister RamMohan Naidu Attend Soft Ball Closing Ceremony: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జూనియర్ అంతర జిల్లాల సాఫ్ట్‌బాల్‌ పోటీలు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్​తో రామ్మోహన్​ నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు. క్రీడాకారులతోపాటు క్రీడలను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన అన్నారు. 

క్రీడల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని ఈ సందర్భంగా రామ్మోహన్​ నాయుడు గుర్తు చేశారు. భారత్​ ఈసారి ఒలింపిక్స్​లో 71వ స్థానంలో నిలిచిందని, ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆతిథ్య జట్లు హుందాగా ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటాయి. రెండు నెలలుగా శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ పెట్టుకున్న ఆశలను క్రీడాకారులు వృథా చేయలేదు. క్రీడాకారులకు, కోచ్, మేనేజర్లకు లోటు పాట్లు లేకుండా జిల్లా అసోసియేషన్‌ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details