ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కనకదుర్గమ్మకు రాజధాని రైతుల మొక్కులు- తుళ్లూరు నుంచి పాదయాత్ర - amaravati farmers padayatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 8:56 AM IST

Amaravati Farmers to Kanaka Durgamma Temple: అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయల్దేరివెళ్లారు. తుళ్లూరు శిబిరం నుంచి కాలినడకన కనకదుర్గమ్మ ఆలయానికి బయల్దేరారు. అమ్మవారికి పొంగళ్లు, చీర-సారె సమర్పించనున్నారు. అమరావతి పనుల్లో కదలిక రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడంతో తమ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందని రైతులు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. 

ఉదయం పాదయాత్రగా వెళ్లిన రైతులు, తుళ్లూరు శిబిరం నుంచి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకోనున్నారు. అమ్మవారికి సారె సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోనున్నారు. రాజధాని పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారికి మొక్కుకుంటామని మహిళలు తెలిపారు.

ఉద్యమ సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరగా పోలీసులు తమపై లాఠీలు ఝుళిపించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే అమ్మవారికి మొక్కుకున్నామని మహిళలు తెలిపారు. తమ కోరిక నెరవేరటంతో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరామని మహిళలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details