LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ - ప్రత్యక్షప్రసారం - BRS Leaders Press Meet Live
Published : Feb 7, 2024, 12:40 PM IST
|Updated : Feb 7, 2024, 12:51 PM IST
BRS Leaders Press Meet Live : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ నేరస్థులను తన పక్కన కూర్చోబెట్టుకుని వాళ్లతో డీల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీరును గులాబీ నాయకులు ఎండగడుతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వ్యవహారంపై తీవ్రంగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రతిపక్షాన ఉండి బలంగా పోరాడతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అన్నారు. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని గులాబీ నేతలు ఫైర్ అయ్యారు.