LIVE : బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders Press Meet live - BRS LEADERS PRESS MEET LIVE
Published : Jul 9, 2024, 11:07 AM IST
|Updated : Jul 9, 2024, 11:31 AM IST
BRS Leaders Press Meet Live : బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పిరాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పనిచేయడం లేదని ఆరోపించారు. కరెంట్ కష్టాలు, అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి మెగా డీఎస్సీ అని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక దగా డీఎస్సీ వేసిందని, డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావులతో పాటుగా ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ అంశంపై చట్టసభలతో పాటుగా కోర్టులో సైతం పోరాడుతామని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైందని విమర్శించారు.
Last Updated : Jul 9, 2024, 11:31 AM IST