కోనసీమలో తాచుపాము కలకలం - భయభ్రాంతులకు గురైన స్థానికులు - snake halchal - SNAKE HALCHAL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 5:54 PM IST
Big Snake in Konaseema District : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అయిదు అడుగుల తాచుపాము హల్చల్ చేసింది. కాట్రేనికోన మండలం చెయ్యారు వడ్డివారి పేటలో నివాస గృహలు మధ్య అయిదు అడుగుల త్రాచుపాము బుసలు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. కొంతమంది ఒకవైపు భయపడుతూనే మరొవైపు పాము కదలికలను సెల్ఫోన్ల్లో బంధించారు. గ్రామస్థులు స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు సమాచారం అందించారు. బుసలు కొడుతున్నా పామును ఓ డబ్బాలో బంధించారు. అనంతరం జన సంచారం లేని ప్రదేశంలో విడిచిపెట్టారు.
ఒకప్పుడు పామును చూడగానే పర్లాంగ్ దూరం పరిగెత్తే వారు, లేదంటే అందుబాటులో ఏదైనా కర్ర దొరికితే పాముని చావబాదేవారు. అది విషసర్పమైనా, సాదాసీదా పామైనా ఆ మాత్రం భయం ఉండేది. ఇప్పుడు ఇంటి పరిసరాల్లోనూ, పొలాల గట్ల మీద పాము కనిపిస్తే దాని కదలికలను సెల్ఫోన్ల్లో వీడియోలు తీస్తున్నారు. అందుబాటులో ఉండే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇస్తున్నారు. దానిని చాకచక్యంగా బంధించి జనావాసాలకు దూరంగా వదిలిపెడుతున్నారు.