దారుణం - ముళ్లపొదల్లో మగ శిశువును పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు - Baby at Garbage - BABY AT GARBAGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 5:02 PM IST
Baby at Garbage: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గరిసినపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువును ముళ్లపొదల్లో పడేశారు. గ్రామ శివారులోని ముళ్లపొదల నుంచి ఏడుపులు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా మగ శిశువు పడిఉన్నాడు. వెంటనే పసిబిడ్డను స్థానికులు బత్తలపల్లి ఆర్డిటీ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియనివారు వాహనంలో తీసుకువచ్చి శిశువును పడేసి వెళ్లారని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బత్తలపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Baby Dead Body in Drain: మరోవైపు విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యమైంది. శ్రీహరిపురం కారాడా వీధి డ్రైన్లో పసికందు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని మండిపడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.