ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బయ్యవరం హైవేపై కాలేజీ బస్సు బీభత్సం - ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు - student died due to college bus - STUDENT DIED DUE TO COLLEGE BUS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 4:27 PM IST

Avanthi College Bus Collided to Tiffin Hotel Died one Student : అనకాపల్లి జిల్లాలో ఓ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. కళాశాలకు వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే టిఫిన్‌ చేస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం బయ్యవరం జాతీయ రహదారి పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ బండి వద్ద కొందరు అల్పాహారం చేస్తున్నారు. అదే సమయంలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు అటుగా వెళ్తుంది. విద్యార్థులతో వెళ్తున్న ఈ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి టిఫిన్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. 

ఈ ఘటనలో అక్కడికక్కడే ఓ బాలుడు మృతి చెందాడు. అదేవిధంగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురు క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో కారుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, టిఫిన్‌ బండి పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఘటనపై కసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details