ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అర్హత- విచారణ వాయిదా వేసిన హైకోర్టు - డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 5:31 PM IST
AP High Court on DSC Notification: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎస్జీటీ(SGT) పోస్టులకు బీఈడీ(BED) అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
HC on DSC Notification 2024: బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డీఈడీ(DED) అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశ వ్యాప్తంగా అమలు కావాలి కదా అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.
DSC Notification in AP: కాగా, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఈడీ వారికి అర్హత ఉండదని ఇంతవరకు అభ్యర్థులు భావించారు. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున డీఎస్సీ-2018లో నిబంధనలనే ఈసారీ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిస్తూ డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చింది.