'రెండు రోజుల్లో అసుర పాలన అంతం'- చంద్రబాబు కోసం అమరావతి రైతుల రాజశ్యామల యాగం - Farmers Rajashyamala Yagam - FARMERS RAJASHYAMALA YAGAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 3:33 PM IST
Amaravati Farmers Rajashyamala Yagam: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కాంక్షిస్తూ రాజధానిలో రైతులు, మహిళలు రాజశ్యామల యాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం పోలేరమ్మ ఆలయం వద్ద యాగం చేపట్టారు. అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రాజశ్యామల యాగం నిర్వహించారు. అమరావతి అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని అమ్మవారికి విన్నవించారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని రైతులు విమర్శించారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని అసుర పాలన అంతం అవుతుందని మహిళలు అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ యాగంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు.
"ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని అసుర పాలన అంతం అవుతుంది." - రాజధాని రైతులు