ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలంటూ - పూజలు చేసిన రైతులు - Amaravati Farmers prayers TTD - AMARAVATI FARMERS PRAYERS TTD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 4:04 PM IST

Amaravati Farmers doing pooja at Tirumala Tirupati Devasthanam in Guntur :  అమరావతి అభివృద్ధి చెందాలంటూ, గుంటూరు జిల్లా అనంతవరంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అమరావతి రైతులు పూజలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలంటూ ఏడుకొండలవాడికి పూజలు చేశారు. మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెం రైతులు, మహిళలు వెంకటపాలెం వరకు పాదయాత్ర చేశారు. అమరావతికి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం గోవిందుని సన్నిధిలో టెంకాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే అమరావతి రూపశిల్పి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు రైతులు తెలిపారు.

అదేవిధంగా అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలకు గుర్తుగా రైతుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అమరావతి బహుజన జేఏసీ నాయకుడు బాలకోటయ్య తెలిపారు. అమరావతి పరిరక్షణ పోరాటంలో 270 మంది రైతులు మరణించారని భావితరాలకు ఉద్యమ విశిష్టత చాటిచెప్పేలా స్మారకాన్ని రూపొందిస్తామన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను మోసగించినందుకే జగన్ ను ఘోరంగా ఓడించారన్నారు.

ABOUT THE AUTHOR

...view details