వైవీ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీని తొలగించాలని విద్యార్థి సంఘాల ఆందోళన - AISF Demands YVU Incharge Transfer - AISF DEMANDS YVU INCHARGE TRANSFER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 10:01 PM IST
AISF Demands Transfer of YV University Incharge Vice-Chancellor : యోగి వేమన యూనివర్సిటీ ఇంఛార్జి ఉపకులపతి కృష్ణా రెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. వైఎస్సార్ జిల్లా గంగనపల్లె వద్ద ఉన్న విశ్వవిద్యాలయ పరిపాలన భవనాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకులు ముట్టడించారు. వైఎస్సార్సీపీ హయాంలో అనేక అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి కృష్ణా రెడ్డిని తిరిగి యూనివర్సిటీ వీసీగా నియమించడం సరి కాదన్నారు. ఇంఛార్జి వీసీ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు నినాదాలు చేశారు.
గత ప్రభుత్వం కృష్ణా రెడ్డి తప్పులను కప్పి పుచ్చిందని వారు ఆరోపించారు. అలాంటి వీసీ ఉంటే మహిళా విద్యార్థులకు రక్షణ ఉండదని విమర్శించారు. గతంలో ప్రిన్సిపాల్‌గా పని చేసినప్పుడు ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైనట్లు తెలిపారు. తక్షణం కృష్ణారెడ్డిని బదిలీ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నేతలతోపాటు విద్యార్థులు సైతం ర్యాలీగా తరలివచ్చి వర్సిటీ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.