ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వ్యవసాయ మోటార్లకు మీటర్లు - ధ్వంసం చేసిన రైతన్నలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 7:21 PM IST

Agriculture Meter Spoiled Farmers In Kurnool District : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వ్యవసాయ మోటార్లకు బిగించిన విద్యుత్తు మీటర్లను రైతులు ధ్వంసం చేశారు.  రైతు సంఘం ఆధ్వర్యంలో పొలాల వద్ద ఉన్న  మీటర్లను రాళ్లతో పగలగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవుతో రైతులు నానా అవస్థలు పడుతుంటే మోటార్లకు మీటర్లు బిగించడం ఏంటని నిలదీశారు. తక్షణమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఆపేయాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా పరిస్థితి దారుణం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగుకు సవా లక్ష సమస్యలు ఉన్నాయని, కొత్తగా ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఏంటని మండిపడ్డారు. తక్షణమే మీటర్లు బిగించే పనులు  మానుకోవాలని హెచ్చరించారు. మిగ్​జాం, సాగునీటి కొరత తట్టుకుని ఇంకా వ్యవసాయం గాడిన పడక ముందే మీటర్లు అంటూ అన్నదాతలను (Farmers) ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.  

ABOUT THE AUTHOR

...view details