ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎఫ్ఎమ్ఎస్ నిధులు దారి మళ్లిస్తున్నారు - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు - CFMS Funds Misuse - CFMS FUNDS MISUSE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 10:35 PM IST

Acham Naidu Complaint To State Chief Electoral Officer : ఆర్థికశాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్ఎమ్ఎస్, సీఎంవో ఆధీనంలోకి  వెళ్లిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆర్థికశాఖలో పారదర్శకత కోసం తెచ్చిన సీఎఫ్ఎమ్ఎస్ వ్యవస్థను రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలు నాశనం చేస్తున్నారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి సీఎఫ్ఎమ్ఎస్ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచే గుత్తేదారులకు సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని ఈసీని కోరారు. ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుజయ్ రెడ్డిలను తక్షణమే విధుల నుంచి తప్పించాలని కోరారు. 

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 11 రోజులవుతున్నా సీఎం ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ మోహన్ రెడ్డి ఫొటో తొలగించలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం జగన్‌కు సంబంధించిన అన్ని ఫొటోలు, సంక్షేమ పథకాల సమాచారం ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details