వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న '250 కుటుంబాలు', ఎక్కడంటే? - Regidi Pedasirlam village news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 12:25 PM IST
250 Families Left From YCP and Joined TDP in Vijayanagaram District : విజయనగరం జిల్లా రేగిడి మండలం పెద్ద సిర్లం గ్రామంలో 250 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఇందులో పెద్ద సిర్లం గ్రామ మాజీ సర్పంచ్ పాలవలస రామచంద్రరావుతో పాటు నలుగురు వార్డ్ సభ్యులు, అలాగే 250 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
వీరికి కొండ్రు మురళీ మోహన్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పడుతుందన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ - జనసేన ప్రభుత్వాని ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.