ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత హల్‌చల్‌ - టీడీపీ సానుభూతిపరులపై దాడి - YSRCP Leaders Attack on Villagers - YSRCP LEADERS ATTACK ON VILLAGERS

YSRCP Leaders Attack on Villagers in Rapthadu: ఎన్నికల వేళ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యకాండ పతాక స్థాయికి చేరింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా అరాచకాలను కొనసాగిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా అర్ధరాత్రి గ్రామంలో తన అనుచరులతో ప్రజలపై దాడికి పాల్పడ్డారు.

YSRCP Leaders Attack on  Villagers in Rapthadu
YSRCP Leaders Attack on Villagers in Rapthadu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 1:37 PM IST

అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత హల్‌చల్‌ - టీడీపీ సానుభూతిపరులపై దాడి

YSRCP Leaders Attack on Villagers in Rapthadu :రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై, కార్యకర్తలపై దాడికి తెగబడున్నారు. ఇన్ని జరగుతున్నా పోలీసులు, అధికారులు తమకు ఏమీ తెలియదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డితో పాటు హల్‌చల్ చేశారు.

టీడీపీ సానుభూతిపరులపై దాడి :ఎన్నికల వేళ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యకాండ పతాక స్థాయికి చేరింది. ఐదు సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా దళితులు, బీసీలపై దాడులకు తెగబడ్డ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా అరాచకాలను కొనసాగిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా అర్ధరాత్రి గ్రామంలో తన అనుచరులతో ప్రజలపై దాడికి పాల్పడ్డారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో రాజశేఖర్ రెడ్డి గ్రామంలో టీడీపీ సానుభూతిపరులైన ఎస్సీలు, వాల్మీకుల ఇళ్లపైకి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఈ విషయాలు చిత్రీకరించిన గ్రామ యువకుడు ఫోన్ లాక్కోని దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నెత్తురు పారించిన జగన్‌ ముఠా - తాలిబాన్లలా వైసీపీ అకృత్యాలు - ysrcp attacks in ap

దీంతో గ్రామంలో ఉన్న ఎస్సీ, వాల్మీకి వర్గ మహిళలు తిరగబడటంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు జారుకున్నారు. దాడి జరుగుతుందని ఇటుకులపల్లి సీఐకి రాత్రి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. అర్ధరాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు గ్రామంలో బీట్ విధులు నిర్వహిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడలేదని తెలిపారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం :మాజీ మంత్రి పరిటాల సునీత ఈ విషయంపై జిల్లా ఎస్పీ అమిత్​కు ఫోన్​లో ఫిర్యాదు చేశారు. తోపుదుర్తిలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు రక్షణ కల్పించాలని గతంలో కూడా పరిటాల సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తోపుదుర్తిలో ఎమ్మెల్యే సోదరులు దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పరిటాల సునీత అన్నారు.

నామినేషన్ వేసేందుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల దాడి- నలుగురికి గాయాలు - YCP workers attacked TDP workers

ABOUT THE AUTHOR

...view details