Sand Dredging in Godavari River in Rajamahendravaram :ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ధవళేశ్వరం పరిధిలో బోట్స్ మెన్ సొసైటీల పేరిట అనుమతులు పొంది పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు నదిలోంచి ఇసుక తెస్తుంటే యంత్రాలతో పడవల్లోని ఇసుకను లారీల్లోకి లోడ్ చేసి పంపిస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది.
కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు- ప్రొక్లైన్లతో నదీగర్భానికి తూట్లు - Illegal Sand Mining
వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు : రాజమహేంద్రవరం గ్రామీణం కొవ్వూరు పరిధిలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోదావరిలో 70 వరకు డ్రెడ్జర్లు తిరుగుతున్నాయి. కలెక్టరేట్, జల వనరుల శాఖ కార్యాలయానికి సమీపంలోనే వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. అయినా అటువైపు ఏ ఒక్క విభాగమూ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. బోట్స్ మన్ సొసైటీల పేరిట అనుమతులు పొందిన రేవుల్లో ఆయా సభ్యులు పడవల్లో నదిలోకి వెళ్లి చేతులతో ఇసుక తవ్వి తీసుకురావాలి. కానీ గోదావరిలో నిబంధనలకు తూట్లు పొడిచి డ్రెడ్జింగ్ చేస్తున్నారు. 30 రీచ్‌లకు అనుమతులుండగా వాటిలో 70 డ్రెడ్జర్లు తిరుగుతున్నాయని అంచనా. వీటి ద్వారా రోజుకు సగటున 35 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారు. తద్వారా 2 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతోంది.