YSRCP Activists Attack on TDP Agents: చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని ననియాల 80వ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ తన అనుచరులతో టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. అనుచరులతో కలిసి పలు బూత్‌లలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి ప్రవేశించడాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సింగసముద్రంలో పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన భరత్ తలుపులు మూసివేయడంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి అనుచరులతో బీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో వైఎస్సార్సీపీ అరాచకం - పోలింగ్ బూత్ తలుపులు మూసిన భరత్ - YSRCP Attack on TDP Agents - YSRCP ATTACK ON TDP AGENTS
YSRCP Activists Attack on TDP Agents: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బెదిరింపులకు పాల్పడుతోంది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి టీడీపీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ బెదిరించారు. సింగసముద్రంలోని పోలింగ్ బూత్‌కు వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ తలుపులు మూయడంపై టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 3:23 PM IST
కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో పలు కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రామకుప్పం మండలంలోని పలు కేంద్రాలలో టీడీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి టీడీపీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ బెదిరించారు.
శాంతిభద్రతలు కాపాడలేకపోయారు - హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం - Chandrababu on Clashes in Palnadu