ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెల్లెళ్లకు సమాధానం చెప్పు - రాజధర్మం పాటించు - జగన్​కు చిన్నమ్మ సౌభాగ్యమ్మ లేఖ - ys viveka Wife Letter to CM Jagan - YS VIVEKA WIFE LETTER TO CM JAGAN

YS Vivekananda Reddy Wife Sowbhagyamma Letter to CM Jagan: సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా ? హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం తగునా అంటూ జగన్​ను ప్రశ్నించారు.

YS Vivekananda Reddy Wife Sowbhagyamma Letter to CM Jagan
YS Vivekananda Reddy Wife Sowbhagyamma Letter to CM Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 10:55 AM IST

Updated : Apr 25, 2024, 11:47 AM IST

YS Vivekananda Reddy Wife Sowbhagyamma Letter to CM Jagan :సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నను సొంత పత్రిక, ఛానెల్‌లో చెప్పలేనంతగా హహనం చేయడం తగునా జగన్‌ అంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019 లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని లేఖలో రాశారు. కుటుబంలోనీ వారే వివేకానంద రెడ్డి హత్యకు కారణం కావడం, వారికి సీఎంగా నువ్వే రక్షణం ఉండటం ఎంతో బాధించిందని
సౌభాగ్యమ్య లేఖలో వెల్లడించారు.

"నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రిక, ఛానెల్‌, సోషల్‌ మీడియాలో హననం చేయించడం తగునా?" అంటూ జగన్​ను లేఖలో నిలదీశారు. "న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా ?" అని ప్రశ్నించారు. "సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా లక్ష్యంగా చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటని?" లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. "కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యమని" ప్రశ్నించారు.

శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా: వివేకా సతీమణి

వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారికి తిరిగి ఎంపీగా అవకాశాన్ని కల్పించడం సమంజసమా అని సౌభాగ్యమ్మ నిలదీశారు. ఇటువంటి దుశ్చర్యలు ఏ మాత్రం మంచిది కాదని, ఇది నీకు తగదని విన్నవించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. "హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా" అంటూ లేఖలో కోరారు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని, ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని వేడుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు.

అప్పటివరకు వివేకా హత్య కేసు అంశం ప్రస్తావించొద్దు - కడప కోర్టు ఉత్తర్వులు - kadapa COURT in VIVEKA MURDER CASE

కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తా: సునీత - Sunitha on Kadapa Court Order

Last Updated : Apr 25, 2024, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details