YS Jagan Pulivendula Tour: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. గన్నవరం నుంచి విమానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన మాజీ సీఎం జగన్, ప్రతి గ్రామంలో వాహనాన్ని నిలిపి కార్యకర్తలను నాయకులను పలకరించారు. కడప నుంచి పులివెందులకు 80 కిలోమీటర్ల దూరానికి నాలుగున్నర గంటలు సమయం కేటాయించారు.
పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకున్న జగన్కు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేసుకుంటూ వాహనంపైనే నమస్కరించుకుంటూ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. పులివెందుల క్యాంపు కార్యాలయానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు పలువురు ముఖ్య నేతలు వచ్చి జగన్‌ను కలిశారు. పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఘోరమైన ఓటమి తర్వాత సొంత నియోజకవర్గ చేరుకున్న జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతితో పలకరించే ప్రయత్నం చేశారు.
పులివెందులకు వచ్చిన జగన్‌ను ప్రాంత వాసులు నిలదీయాలి: బీటెక్ రవి - BTech Ravi on YS Jagan
ఓటమి అనంతరం తొలిసారి పులివెందులకు: ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి పులివెందుల పర్యటన పై ఆ పార్టీ నేతల్లో ఆసక్తిని పెంచింది. తొలుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీమణి వైఎస్ భారతీ ప్రత్యేక విమానంలో కడప బయలుదేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళ్లనున్నారు.